Sandisk వైర్‌లెస్ యూఎస్‌బీ స్టిక్
శాన్‌డిస్క్ సంస్థ తాజాగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన 'వైర్‌లెస్ యూఎస్‌బీ స్టిక్' పెన్‌డ్రైవ్ లాగే పనిచేస్తుంది. దీన్ని వాడాలంటే ముందుగా పీసీకి యూఎస్‌బీ డ్రైవ్ ద్వారా కనెక్ట్ చేసి చార్జింగ్ చేసుకోవాలి. అదే సమయంలో ఏవైనా ఫైల్స్ ఉంటే దాంట్లోకి కాపీ చేసుకోవచ్చు. ఈ స్టిక్ పూర్తిగా చార్జింగ్ అయిన తరువాత దానిపై ఉండే పవర్ బటన్‌ను ప్రెస్ చేయాలి. అనంతరం స్మార్ట్‌ఫోన్‌లో ఉండే శాన్‌డిస్క్ కనెక్ట్ యాప్ ద్వారా డివైస్‌కు కనెక్ట్ అవ్వాలి. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో వైఫైని ఆన్ చేయాల్సి ఉంటుంది. యూఎస్‌బీ స్టిక్ క్రియేట్ చేసిన వైఫై హాట్ స్పాట్‌కి మీ స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ అవుతుంది.
అనంతరం యాప్ ద్వారా ఫైల్స్‌ను కాపీ, పేస్ట్ చేసుకోవచ్చు. ఆడియో, వీడియో ఫైల్స్‌ను నేరుగా స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఈ డివైస్ హాట్‌స్పాట్‌కు డిఫాల్ట్‌గా ఎలాంటి పాస్‌వర్డ్ ఉండదు. నేరుగా కనెక్ట్ అవుతుంది. అయితే సెక్యూరిటీ కోసం యూజర్ తన సొంత పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ స్టిక్ ద్వారా ఒకసారి కేవలం ఒకే డివైస్‌కు కనెక్ట్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఇది 16 జీబీ నుంచి 128 జీబీ వరకు వివిధ రకాల సైజ్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
ఎక్కడ కొనాలంటే
Amazon లో 16 జీబీ 1745/-
Flipkart లో 16 జీబీ 1825/-
Comments
Post a Comment