స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా ?

వివిధ రకాల ఆకట్టుకునే ఫీచర్లతో నేడు అనేక కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లు మనకు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ప్రధానంగా వీటిలో అధిక శాతం అమ్ముడవుతున్నవి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందినవే. అయితే ఎంత బడ్జెట్‌లో ఆండ్రాయిడ్ ఓఎస్‌కు చెందిన టాప్ స్మార్ట్‌ఫోన్లు ఏవేవి వస్తాయో తెలుసుకోవాలంటే మాత్రం కింద ఇచ్చిన కథనాన్ని చదివి తీరాల్సిందే.
రూ.4,500 – రూ.7వేల బడ్జెట్‌లో షియోమీ రెడ్‌మీ 2 ప్రైమ్, లెనోవో ఎ6000 ప్లస్, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ జ్యూస్ 2, యూ యుఫోరియా ఫోన్లు వస్తాయి.
రూ.7వేలు – రూ.13వేల బడ్జెట్‌లో మోటో జి (జెన్ 3), లెనోవో కె3 నోట్, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 5, కూల్‌ప్యాడ్ నోట్ 3, అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్, షియోమీ ఎంఐ4 ఫోన్లు వస్తాయి.
రూ.13వేలు – రూ.20వేల బడ్జెట్‌లో మోటో ఎక్స్ ప్లే, అసుస్ జెన్‌ఫోన్ సెల్ఫీ, జెన్‌ఫోన్ 2, లెనోవో పి1, మెయ్‌జు ఎంఎక్స్5, సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా, శాంసంగ్ గెలాక్సీ జె5, జె7 వంటి ఫోన్లు వస్తాయి.
రూ.20వేలు – రూ.26వేల బడ్జెట్‌లో వన్ ప్లస్ 2, అసుస్ జెన్‌ఫోన్ 2 డీలక్స్, లెనోవో వైబ్ షాట్, హువావే హానర్ 7, సోనీ ఎక్స్‌పీరియా సి4 ఫోన్లు వస్తాయి.
.రూ.26వేలు – రూ.33వేల బడ్జెట్‌లో గూగుల్ నెక్సస్ 5ఎక్స్, మోటో ఎక్స్ స్టైల్, శాంసంగ్ గెలాక్సీ నోట్ 4, హెచ్‌టీసీ వన్ ఈ9+, సోనీ ఎక్స్‌పీరియా సి5 అల్ట్రా ఫోన్లు వస్తాయి.
రూ.33వేలు – రూ.40వేల బడ్జెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్6, ఎల్‌జీ జీ4, గూగుల్ నెక్సస్ 6పి, హెచ్‌టీసీ వన్ ఎం9 ఫోన్లు వస్తాయి.
రూ.40వేలు, ఆపైన బడ్జెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్, ఎడ్జ్+, సోనీ ఎక్స్‌పీరియా జడ్5 ఫోన్లు వస్తాయి.
Comments
Post a Comment