Posts

Showing posts from December, 2015

మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చటం ఏలా...

Image
ఇంటర్నెట్‌ను వినియోగిస్తోన్న దాదాపు చాలామందికి ఈ పదం తెలుసు. వై-ఫై (వైర్ లెస్ ఫెడిలిటీ), ఈ సాంకేతిక ఆధారంగా కేబుల్ అవసరం లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్‌ను సమీప ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లకు వైర్ల సహాయం లేకుండా విస్తరించుకోవచ్చు. థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హబ్‌గా మార్చే ప్రక్రియను తెలుసుకుందాం.. వై-ఫై హాట్‌ స్పాట్‌గా మార్చాలనుకుంటున్న మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో తప్పనిసరిగా వైర్‌లెస్ అడాప్టర్ ఉండాలి. మీ ల్యాప్‌టాప్‌లో వై-ఫై హాట్ స్పాట్‌ను క్రియేట్ చేసేందుకు అనేక థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు My Wifi Router.. మీ ల్యాప్‌టాప్‌లో వై-ఫై హాట్ స్పాట్‌ను సెటప్ చేసే క్రమంలో మీ హాట్ స్పాట్‌‍కు ఇతర డివైస్‌లు ఏ విధమైన పాస్‌వర్డ్ సహాయం లేకుండా కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది. WEPను సెలక్ట్ చేసుకున్నట్లయితే హాట్ స్పాట్ కు కనెక్ట్ అయ్యే ప్రతి కనెక్షన్ కు పాస్ వర్డ్ అవసరమవుతుంది. సాధ్యమైనంత వరకు మీ హాట్ స్పాట్ ను సెక్యూరిటీ కనెక్టెడ్ మోడ్ లో లాంచ్ చేయండి.

BEST ANTI-THEFT ANDROID APP

Image
ఈ యాప్ పేరు Cerberus.దీనికి మిగిలిన ఫోన్లకు ఉన్న తేడా ... ఇది కేవలం ఫోన్ ఏ ప్రదేశంలో ఉంది అనే విషయమే మాత్రమే కాదు, ఎవరి చేతుల్లో ఉంది, అతని ముఖం కుడా చూపించి ఫోన్ మీ వద్దకు తిరిగి తెచ్చే ఆప్షన్స్ ఇస్తుంది. A) వెబ్ సైట్ ద్వారా మీ ఫోన్ ను రిమోట్ కంట్రోలింగ్ చేయటం. B) SMS కమాండ్స్ ద్వారా రిమోట్ కంట్రోల్. (పోయిన ఫోన్ లో నెట్ లేకపోతే) C) మీరు కంట్రోల్ చేయకుండానే ఆటోమేటిక్ గా అది అలర్ట్స్ పంపటం. (పోయిన విషయం తెలియనప్పుడు) కేవలం మొబైల్ లొకేషన్ ట్రాకింగ్ కాదు, ఫోన్ వాడుతున్న వ్యక్తి యొక్క ఫోటో , వీడియోస్ కూడా పంపిస్తుంది మెయిల్ కు. దొంగతనం చేసిన వ్యక్తి ఫోన్ షాట్ డౌన్ కూడా చేయనివ్వకుండా పవర్ ఆప్షన్ ను డిసేబుల్ చేస్తుంది. అలాగే స్టేటస్ బార్ కూడా బ్లాక్ చేయగలదు.ఫోన్ ను సిస్టం యాప్ గా ఇంస్టాల్ చేస్తే(రూట్ ఉంటే) కంప్లీట్ UNINSTALL చేసి GPS ను తిరిగి ఏనాబెల్ చేస్తుంది. మైక్రోఫోన్ ద్వారా ఆడియో రికార్డింగ్. 1. సిమ్ మార్చగానే, మెయిల్ కు లేదా మీరు ముందుగా సెట్ చేసిన నంబర్ కు ఫోన్ వాడుతున్న వ్యక్తి యొక్క ఫోటో ను పంపిస్తుంది. 2. మీరు ముందుగా సెట్ చేసిన ఏరియా నుండి ఫోన్ దాటితే, మెయిల్ కు అలెర్ట్...

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారా.? పోయిన ఫోన్‌‌లో డేటాను చేరిపేయటం ఏలా.?

Image
మీ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారా.? మీ మిస్సింగ్ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు అలానే మెసేజ్‌లను పూర్తి స్థాయిలో డిలీట్ చేసేందుకు ఓ అత్యుత్తమ సొల్యూషన్‌ను ఆండ్రాయిడ్ అందిస్తోంది. మీరు పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ డివైస్, గూగుల్ అకౌంట్ అలానే ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నట్లయితే లోపలి డేటాను రిమోట్ విధానంలో డిలీట్ చేయవచ్చు.ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ విధానంలో లోకేట్ చేయవచ్చు. డివైస్ లోకేషన్‌ను మ్యాప్‌లో చూడొచ్చు. (గమనిక: ఫోన్ ఆన్ చేసి ఉంటేనే దాని లోకేషన్‌ను మీరు ట్రేస్ చేయగలరు). ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ద్వారా మీ డివైస్‌ను ట్రేస్ చేసిన తరువాత మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో ఒకటి రింగ్, మరొకటి లాక్ అండ్ ERASE. రింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ డివైస్ ఫుల్ వాల్యుమ్‌తో 5 నిమిషాల పాటు బెగ్గరగా రింగ్ అవుతుంది. లాక్ ఆప్షన్‌ను ఎంపిక చేసేుకున్నట్లయితే రిమోట్ విధానం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేసేయవచ్చు. Erase ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ ఫోన్‌లోని అన్ని సెట్టింగ్స్‌తో సహా మ్...

ఫోన్‌ను ముట్టుకోకుండా మెసెజ్‌కు రిప్లై ఇవొచ్చు...

Image
డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ టెక్స్టింగ్ చాలా ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చాలా మంది పెడచెవిన పెట్టేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్నసమయంలో స్మార్ట్‌ఫోన్‌లను వాడటం కారణంగా డ్రైవింగ్ పై ఏకాగ్రత దెబ్బతింటుంది, ఈ కారణంగా ఎటువంటి అనర్థాలైనా జరగొచ్చు.డ్రైవింగ్ సీటులో కూర్చున్నప్పుడు సాధ్యమైనంతవరకు వరకు ఫోన్ టెక్స్టింగ్ లకు దూరంగా ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలి..? కొన్ని ముఖ్యమైన సందేశాలకు తక్షణమే రిప్లై ఇవ్వవల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో హ్యాండ్స్- ఫ్రీ మెసేజింగ్ ఆప్షన్‌ను మీరు ఎంపిక చేసుకున్నట్లయితే రిస్క్ కాస్త తగ్గుతుంది. ఆండ్రాయిడ్ యూజర్లు కోసం ‘Google Now' ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం గూగుల్ ‘Google Now' పేరుతో శక్తివంతమైన టూల్‌ను లాంచ్ చేసింది. వాయిస్ కమాండ్స్ ఆధారంగా స్పందించే ఈ హ్యాండ్స్ - ఫ్రీ టూల్ మీ వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేస్తుంది.ఆండ్రాయిడ్ ఫోన్ మైక్రోఫోన్‌కు వినిపించేలా "OK, Google" అని చెప్పండి. వెంటనే ‘Google Now' మీ మాటలు వినే ప్రయత్నం చేస్తుంది. తాజాగా పొందుపరిచన అప్‌డేట్‌లో భాగం...

ఇండియాలో గూగల్ ఆఫ్ లైన్ మ్యాప్స్ నావిగేషన్ ...

Image
మీకు ఇంటర్నెట్ లేకపోయినా గూగల్ మ్యాప్స్ సహాయంతో అన్ని ప్రదేశాలు తెలుసుకోగలరు. కొంతమందికి ఇంటిలో లేదా ఆఫీస్ లో WiFi ఉంటుంది కాని మొబైల్ లో నెట్ ఉండదు. సో అలాంటి వారికి అలాగే ఇంట్లోని పెద్ద వాళ్లకు కూడా use అవుతుంది. ఇంటర్నెట్ ఉన్నప్పుడు మ్యాప్స్ డేటా అంతా మొబైల్ లో సేవ్ చేసుకుంటే, సేవ్ అయిన డేటా నుండి నేవిగేషన్ ప్లేసెస్ సర్చింగ్ పనిచేస్తాయి. ఇంటర్నెట్ ఉంటే అదే మ్యాప్స్ లో లైవ్ ట్రాఫిక్ మరియు ఇతర చిన్న ఫీచర్స్ ను పొందగలరు. ఈ ఆఫ్ లైన్ ఫీచర్స్ కేవలం ఆండ్రాయిడ్ కు మాత్రమే ఉన్నాయి. ఎలా డౌన్లోడ్ ఆఫ్ లైన్ మ్యాప్స్..? మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి, లెఫ్ట్ సైడ్ ఉండే మెను పై క్లిక్ చేస్తే Offline Maps అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి + సింబల్ ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీకు కావలిసిన మ్యాప్స్ ఏరియా ను టైప్ చేయండి. తరువాత మీ ఇంటర్నెల్ స్టోరేజ్ అండ్ మీరు తిరిగే ప్రదేశాలు అనుగుణంగా క్రింద మ్యాప్స్ లో ఏరియా ను సెలెక్ట్ చేయండి. అయితే 30 రోజుల తరువాత అదే మ్యాప్స్ ను మళ్ళీ డౌన్లోడ్ చేయాలి. మ్యాప్స్ 30 రోజులకు కొత్త మార్పులతో ఉంటుంది. అందుకే గూగుల్  రీ డౌన్లోడ్ ఆప్షన్ పెట్టింది.

అమెజాన్ లో ఆవుపేడ గోమూత్రం ఆన్ లైన్ సేల్స్...

Image
4 పిడకలు 249/- మాత్రమే  గోమూత్రం 80/-  మాత్రమే.. ప్రస్తుతం మనకు కావాల్సిన ఏ వస్తువలైనా జస్ట్ ఒక్క క్లిక్  తో మనముందు వాలిపోతున్నాయి. ఈ-కామర్స్ బిజినెస్ ద్వారా ఆన్ లైన్ లో రోజుకు కొన్ని లక్షల వస్తువులు అమ్ముడుపోతుంటాయ్ . ఆన్ లైనే అడ్డాగా చేసుకొని ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, చెప్పులు ఇలా అన్ని రకాలు వస్తువులు అమ్ముతుంటారు. బుక్ చేస్తే చాలు ఐటమ్ తో  ఇంటి ముందుకు వచ్చి మన కాలంగ్ బెల్ కొడుతాడు డెలివరీ బాయ్స్..  అయితే ఇప్పుడు తాజాగా ఆవుపేడ కూడా ఆన్ లైన్ లో దొరుకుతుంది.  ఆవుపేడ, ఆ పేడతో చేసిన పిడకలు, గోమూత్రం…కూడా ఆన్ లైన్ లో సరసమైన ధరలకు లభిస్తున్నాయ్.. ప్రముఖ ఈ-కామర్స్ బిజినెస్ సంస్థ అమెజాన్ లో ఆవుపేడతో చేసిన  పిడకల రేట్లు ఇలా ఉన్నాయ్ .  4 పిడకలు రూ.249 కాగా, 8 పిడకలు రూ. 319  పండుగల వేళల్లో పట్టణ ప్రాంతాలలో ఈ పిడకలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారట. ఆవు పేడను, గోమూత్రాన్ని పవిత్రంగా పూజించే మనదేశంలో పల్లెలలో ఎలాగు దొరుకుతాయి కాబట్టి, సిటీలలో వీటికి డిమాండ్ ఎక్కువట. గోమూత్రాన్ని ఒక బాటిల్ లో నింపి దీని ధర రూ. 80 లుగా నిర్ణయించి, దీ...

స్మార్ట్‌ఫోన్‌ తో ఇక పై చదువుకోండి..

Image
స్మార్ట్‌ఫోన్‌ తో  ఇక పై ఫోన్‌కాల్స్, ఇంటర్నెట్, facebook whatsapp,Games , ఫోటోలు, వీడియోలు చూడడం ఈ  పనులకే కాదు ఇప్పుడు చదువుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఎలా అంటే   KHAN ACADEMY అనే ఈ  యాప్‌ ద్వారా . అవును... దీని ద్వారా ఆయా సబ్జెక్టులను ఉచితంగా చదువుకోవచ్చు.డౌన్లోడ్ చేసుకోవడానికి పేరు మీద క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై లభిస్తున్న ఈ యాప్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.  ఇందులో గణితం, సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్, సివిక్స్, ఫైనాన్స్ తదితర అనేక అంశాలకు చెందిన టాపిక్స్ ఉన్నాయి. వీటిలో విద్యార్థులు తమకు కావల్సిన సబ్జెక్టును చదువుకోవచ్చు. వీటికి సంబంధించిన దాదాపు 10వేలకు పైగా వీడియోలు కూడా ఈ యాప్‌లో ఉన్నాయి. ఖాన్ అకాడమీ  ఒక లాభాపేక్ష లేని  విద్యా సంస్థ. దీనిని 2006 లో యoఐటి  నుండి పట్టాపొందిన సల్మాన్ ఖాన్  అనే దక్షిణాసియా మూలాలు గల అమెరికన్ స్థాపించాడు. "అత్యున్నత ప్రమాణాలు గల విద్య అందరికీ ఎక్కడైనా "అందించే ఉద్దేశంతో స్థాపించబడిన ఈ స...

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడడం ద్వారా మొబైల్ ఇంటర్నెట్ డేటా'ను సేవ్ చేసుకోండిలా...

Image
 స్మార్ట్‌ఫోన్లు కలిగిన వినియోగదారులు ఇప్పుడు తమ తమ డివైస్‌లలో 70 శాతం వరకు డేటాను ఆదా చేసుకోవచ్చు. డివైస్‌లలో ఉండే 'గూగుల్ క్రోమ్ బ్రౌజర్' ద్వారా ఇది సాధ్యపడుతుంది. గూగుల్ కంపెనీ ప్రతినిధులే చెబుతున్నారు. అధిక శాతం మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు 'వైఫై హాట్‌స్పాట్‌'ల ద్వారా ఇంటర్నెట్   పొందుతున్నారు. కానీ కొన్ని సార్లు మొబైల్‌లోని డేటా కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్‌ను పొందాల్సి వస్తోంది. దీంతోపాటు తక్కువ బ్యాండ్ విడ్త్ కలిగిన వినియోగదారులు కూడా వెబ్ పేజీలు సరిగా లోడ్ అవక ఇబ్బందులు పడుతుంటారు. అయితే మీరు ఇప్పుడు మీ  డివైస్‌లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడడం ద్వారా ఆయా వెబ్‌సైట్లను వేగంగా లోడ్ చేసి చూడడమే కాకుండా , ఇంటర్నెట్ డేటాను కూడా ఆదా చేసుకునేందుకు వీలుంది. ఎలా అంటే ముందుగా డివైస్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను డౌన్లోడ్ చేసుకోండి .తర్వాత Settings లోకి వెళ్లి Advanced > DATA SAVER ఆప్షన్‌ను ఆన్ చేసుకుంటే సరిపోతుంది. దీని వల్ల ఇంటర్నెట్ డేటా సేవ్ అవుతుంది. తక్కువ బ్యాండ్ విడ్త్ ఉంటే కేవలం టెక్ట్స్ వెర్షన్‌లోనే వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. స్పీడ్ ఎక్కువైత...

Sandisk వైర్‌లెస్ యూఎస్‌బీ స్టిక్

Image
శాన్‌డిస్క్ సంస్థ తాజాగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన 'వైర్‌లెస్ యూఎస్‌బీ స్టిక్' పెన్‌డ్రైవ్ లాగే పనిచేస్తుంది. దీన్ని వాడాలంటే ముందుగా పీసీకి యూఎస్‌బీ డ్రైవ్ ద్వారా కనెక్ట్ చేసి చార్జింగ్ చేసుకోవాలి. అదే సమయంలో ఏవైనా ఫైల్స్ ఉంటే దాంట్లోకి కాపీ చేసుకోవచ్చు. ఈ స్టిక్ పూర్తిగా చార్జింగ్ అయిన తరువాత దానిపై ఉండే పవర్ బటన్‌ను ప్రెస్ చేయాలి. అనంతరం స్మార్ట్‌ఫోన్‌లో ఉండే శాన్‌డిస్క్ కనెక్ట్ యాప్ ద్వారా డివైస్‌కు కనెక్ట్ అవ్వాలి. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో వైఫైని ఆన్ చేయాల్సి ఉంటుంది. యూఎస్‌బీ స్టిక్ క్రియేట్ చేసిన వైఫై హాట్ స్పాట్‌కి మీ స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ అవుతుంది. అనంతరం యాప్ ద్వారా ఫైల్స్‌ను కాపీ, పేస్ట్ చేసుకోవచ్చు. ఆడియో, వీడియో ఫైల్స్‌ను నేరుగా స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఈ డివైస్ హాట్‌స్పాట్‌కు డిఫాల్ట్‌గా ఎలాంటి పాస్‌వర్డ్ ఉండదు. నేరుగా కనెక్ట్ అవుతుంది. అయితే సెక్యూరిటీ కోసం యూజర్ తన సొంత పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ స్టిక్ ద్వారా ఒకసారి కేవలం ఒకే డివైస్‌కు కనెక్ట్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఇది 16 జీబీ నుంచి 128 జీబీ వరకు వివిధ రకాల సైజ్‌ల...

మై నేమ్ రింగ్‌టోన్ మేకర్..

Image
మై నేమ్ రింగ్‌టోన్ మేకర్' పేరిట ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త యాప్ ద్వారా యూజర్లు తాము లేదా తమకు నచ్చిన ఇతరులెవరి పేర్లనైనా రింగ్‌టోన్లుగా సెట్ చేసుకునే అవకాశం ఉంది. యూజర్లు డివైస్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత తాము రింగ్‌టోన్ కావాలనుకున్న పేరును ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన పేరును యాప్‌లో పొందు పరిచిన అనేక రకాల పురుషుల, మహిళల గొంతు ద్వారా విని దాన్ని రింగ్‌టోన్‌గా సెట్ చేసుకునేందుకు వీలుంది. ఆండ్రాయిడ్ 2.3 ఆ పైన వెర్షన్ కలిగిన వినియోగదారులు ప్రస్తుతం ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Download Link ఇక్కడ క్లిక్ చేయండి.. 

Adobe ఫొటోషాప్ లైట్ రూం

Image
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీసీ యూజర్లలో అధిక శాతం మంది వాడుతున్న ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ 'ఫొటోషాప్'. అడోబ్ సంస్థకు చెందిన ఈ సాఫ్ట్‌వేర్ కొంత మార్పు చెంది 'లైట్ రూం' పేరిట కూడా పీసీ, ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీన్ని వాడుకోవాలంటే గతంలో ఎంతో కొంత రుసుం చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రం ఎలాంటి రుసుం ల ేకుండానే 'PHOTOSHOP LIGHTROOM' యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఐఓఎస్ యూజర్లకు ఈ యాప్ ఇప్పటికే ఉచితంగా లభిస్తుండగా, తాజాగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా దీన్ని ఫ్రీగా అందిస్తున్నారు. ఈ యాప్ ద్వారా డివైస్‌లోని ఫొటోలను మనకు కావల్సిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. అందుబాటులో ఉండే ఫిల్టర్స్, ఎఫెక్ట్స్‌ను ఉపయోగించి మన ఫొటోలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు..

వాట్సాప్ వార్నింగ్.

Image
సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్‌తో పనిచేసే తక్షణ సమాచార వ్యవస్థే వాట్సాప్. వీడియోలు, మెస్సేజ్‌లు ఉచితంగా పంపించుకునే వీలుండడంతో అధికంగా వాడుతుంటారు. ప్రతి రోజూ వాట్సాప్‌ల ద్వారా కోట్లలో మెస్సేజ్‌లు, ఫొటోలు వెళ్తున్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వాట్సాప్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకోసం ఎక్కడో మనం సరదాగా తీసుకున్న ఫొటోను మన స్నేహితులకు షేర్‌చేస్తే, మన ప్రమేయం లేకుండానే ఇతరులు చూసే ఆస్కారం ఉంది. దానిని మార్పింగ్ చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే వ్యక్తిగత సమాచారం, ఫొటోలు ఇతరులకు షేర్ చేయకపోవడమే మంచిది. అలాగే లొకేషన్ షేరింగ్ కూడా మన భద్రతకు ముప్పు తెస్తుంది. దీనివల్ల మనం ఎక్కడున్నామో అగంతకులకు తెలిసే వీలుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. * ఫొటో అప్‌లోడ్‌పై అజాగ్రత్త వద్దు. * నిబంధనలు తెలియని యాప్‌లు డౌన్‌లోడ్ చేయద్దు. * అపరిచితుల సందేహాలకు సమాధానం ఇవ్వద్దు. * యాంటీ హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను మొబైల్‌లో ఉంచుకోవద్దు. * ఫ్యామిలీ పర్యటనల వివరాలు, లొకేషన్స్ షేర్ చేయద్దు. * పరిచయం, ...

ఆరోగ్య రక్షణ'కు ముఖ్యమైన 'టిప్స్

Image
నేటి ఆధునిక యుగంలో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ వహిస్తున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు పౌష్టికాహారం, వ్యాయామం వంటి పనులతో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే కేవలం ఇవే కాకుండా కింద పేర్కొన్న పలు సూచనలు పాటిస్తే హెల్త్ విషయంలో మరింత జాగ్రత్త వహించవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అల్లోపతి మందులను చల్లని నీటితో తీసుకోకూడదు. 2. సాయంత్రం 5 గంటలు దాటితే చాలు, ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోకూడదు. 3. ఉదయం పూట నీరు బాగా తాగాలి, రాత్రి పూట తక్కువ చేయాలి. 4. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రించడం ఉత్తమ ఆరోగ్య ఫలితాలను ఇస్తుంది. 5. భోజనం చేసిన వెంటనే నిద్రించకూడదు. 6. ఎడమచెవి వద్దే ఫోన్ పెట్టుకుని మాట్లాడాలి. 7. ఫోన్‌లో కేవలం ఒక్క బార్ మాత్రమే బ్యాటరీ పవర్ ఉన్నప్పుడు కాల్స్ అస్సలు మాట్లాడకూడదు. ఆ సమయంలో రేడియేషన్ శక్తి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

గూగుల్ నుండి అఫిషియల్ గా కొత్త తెలుగు టైపింగ్ కీ బోర్డ్ అప్లికేషన్

Image
Google Indic Keyboard గూగుల్ తాజాగా  తెలుగు మరియు ఇతర ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్ కోసం అఫిషియల్ కీ బోర్డ్ అప్లికేషన్ లాంచ్ చేసింది. ఇది తెలుగు టైప్ చేయటానికి రెండు మెథడ్స్ ఇస్తుంది... 1. Tinglish (ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తో తెలుగు పదాలను వ్రాయటం. Eg - TELANGANA అని టైప్ చేస్తే తెలంగాణా  అని వస్తుంది) 2. డైరెక్ట్ గా కీ బోర్డ్ పై ఉండే తెలుగు అక్షరాల కీస్ ప్రెస్ చేసి, తెలుగు వ్రాయటం. Tinglish టైపింగ్ చాలా ఈజీ. తెలుగు కీ బోర్డ్ తో పాటు ఇంగ్లీష్ కూడా ఇస్తుంది. అయితే ఆప్షనల్ గా ఈ రెండింతో పాటు ఇతర భాషలు కూడా యాడ్ చేయగలరు అదే యాప్ లో. తెలుగు టైప్ చేసేటప్పుడు పైన సజెషన్స్ కూడా ఇస్తుంది. సో మీరు కంప్లీట్ వర్డ్ టైప్ చేయవలసిన అవసరం ఉండదు. కీస్ పై ప్రెస్ చేస్తే, సౌండ్, అండ్ వైబ్రేషన్ కూడా వస్తుంది. DOWNLOAD చేసుకోవడానికి   ఈ లింక్ లో చూడగలరు.

మెడికల్ ఫీల్డ్ లో రానున్న ఫ్యూచర్ టెక్నాలజీస్

Image
మన సొంత అవసరాలకు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిన విషయమే. కానీ నిజమైన అవశరం ఉన్న మెడికల్ రిసర్చ్ లో రానున్న ఫ్యూచర్ మార్పులను చూడండి. Nanobots. మీ బ్లడ్ లోకి వెళ్లి వైట్ బ్లడ్ cells మాదిరిగా పనిచేస్తాయి. చాలా ఫాస్ట్ గా diseases ను fight చేస్తాయి. chemotherapy వంటి మెడికల్ situations కు ఇది బాగా useful కానుంది. హార్ట్ in బాక్స్ మనషి చనిపోతే గుండె ఆగిపోతుంది అని అందరికీ తెలుసు. కాని మనిషి లోపలే కాదు బయట కూడా గుండె ను ఆగిపోకుండా కొట్టుకునేలా ఒక బాక్స్ తయారు చేశారు. ఎలక్ట్రానిక్ ASPIRIN autonomic టెక్నాలజీస్ అనే కంపెని పర్మనంట్ గా headache ను సాల్వ్ చేసే nerve ను మన head లోపల ఉంచేందుకు పనిచేస్తుంది. నొప్పి ని కలిగించే nerves ను నిరోదిస్తుంది ఇది. మైగ్రేన్స్ మరియు ఫ్రిక్వెంట్ తల నొప్పిలతో బాధపడే వారికీ ఇది మంచి టెక్నాలజీ.

iReff తాజా రీచార్జి ఆఫర్లు తెలిపే మంచి android App

Image
మీరు మీ ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జి చేసే ముందు ఓ క్షణం ఆగండి. మీ అవసరానికి తగిన రీచార్జి ప్రొడక్టు/ధర ఏదో చూసి మరీ ఎంచుకోండి. అయితే ఎలా అన్న ప్రశ్న వస్తుంది. మీ దగ్గర ఓ యాండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే.. అందులో iReff  (  అప్లికేషన్ లింక్ కోసం పేరు మీద క్లిక్ చేయండి ) అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు. ఇది తాజా రీచార్జి ఆఫర్లు, ఏ ప్లాన్ వేసుకుంటే ఎలాంటి లాభాలు అన్న విషయాలను చక్కగా వివరిస్తుంది. Topup, SMS, Data(GPRRS/2G మరియు 3G), Local, STD, ISD ఇలా పలు సాధారణ కేటగిరీల వారీగా మీరు సమాచారం సరిచూసుకోవచ్చు. లేదంటే శక్తిమంతమైన text search  సౌకర్యం ఉపయోగించి కూడా మీ అవసరానికి తగిన ఆఫర్ ఎంచుకోవచ్చు. మీరు Topup వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్లు ఇలా చాలా వివరాలు ఇందులో పొందొచ్చు. డేటా ఏ రోజుకారోజు ఇందులో అప్డేట్ అవుతుంది.  బీఎస్ఎన్ఎల్ మాత్రం  ఇంకా ప్రయోగదశలో ఉంది.        iReff ప్రస్తుతం అన్ని టెలికం సర్కిళ్లలో కింది వాటికి సంబంధించిన సమాచారం అందిస్తోంది

మొజిల్లా ఫైర్‌ఫాక్స్' ఓఎస్‌కు తెర.

Image
  ఇంటర్నెట్ బ్రౌజర్ సాఫ్ట్‌వేర్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్న మొజిల్లా సంస్థ గత 2 ఏళ్ల కింద ప్రవేశపెట్టిన తన 'మొజిల్లా ఫైర్‌ఫాక్స్' ఓఎస్‌ను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. అయితే సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు మాత్రం ఈ ఓఎస్ అందుబాటులోనే ఉంటుంది. వారు దీన్ని తమ ప్రయోగాల కోసం ఉపయోగించుకోవచ్చు.  వినియోగదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉన్నందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు మొజిల్లా ప్రతినిధులు చెబుతున్నారు. 2013లో ఫైర్‌ఫాక్స్ ఓఎస్‌ను ప్రవేశపెట్టగా 'స్పైస్ ఫైర్ వన్ ఎంఐ-ఎఫ్‌ఎక్స్2, ఆల్కాటెల్ వన్ టచ్ ఫైర్ సి, ఆల్కాటెల్ ఆరెంజ్ కిల్ఫ్, ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్‌ఎక్స్, ఫైర్‌ఫాక్స్ యూ105, ఎల్‌జీ ఎఫ్‌ఎక్స్0' వంటి డివైస్‌లు దీన్ని ఆధారంగా చేసుకుని మార్కెట్‌లోకి వచ్చాయి. దీంతోపాటు పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా ఫైర్‌ఫాక్స్ ఓఎస్ ఆధారిత 'హెచ్‌డీ టీవీ'లను వినియోగదారుల కోసం ప్రవేశపెట్టాయి.  అయితే ఈ ఉత్పత్తులకు అంతగా ఆదరణ లభించలేదు. దీంతో ఆ ఓఎస్‌కు ప్రస్తుతం మొజిల్లా సంస్థ చరమ గీతం పాడింది. ఇప్పుడిది అందుబాటులో లేకపోయినా యూజర్లకు మరింత నాణ్యంగా సేవలందించేలా తీర్చిదిద్ది త్వ...

లైన్‌'లో స్టోర్ చేసుకోండి.

Image
ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్స్ అన్నీ ఏదో ఒక ఫీచర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తమ యాప్ వెర్షన్స్‌కు అప్‌డేట్‌లను అందిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇదే కోవలో ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ 'లైన్ (LINE)' మరో నూతన ఫీచర్‌తో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.  లైన్ యాప్‌ను వాడుతున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్, పీసీ వినియోగదారులు ఇప్పుడు తమ తమ డివైస్‌లలో ఉన్న టెక్ట్స్, ఇమేజ్, వాయిస్ మెసేజ్, ఇతర ఫైల్స్‌ను ఆ యాప్‌కు చెందిన 'కీప్' ఫీచర్ ద్వారా ఆన్‌లైన్ క్లౌడ్‌లో స్టోర్ చేసుకునేందుకు వీలుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు దాదాపు 1 జీబీ వరకు స్టోరేజ్ స్పేస్‌ను పొందవచ్చు. ఏ డివైస్ నుంచి స్టోర్ చేసుకున్న ఫైల్స్‌నైనా ఇతర డివైస్ వాడినప్పుడు కూడా యాక్సెస్ చేసుకునేలా వీలు కల్పించారు. లైన్ నూతన వెర్షన్‌కు అప్‌డేట్ అయితే యూజర్లు ఈ ఫీచర్‌ను పొందవచ్చు. 

ఇండో-పాక్ సిరీస్‌పై నేడు నిర్ణయం

Image
కరాచీ: ఎటూ తేలకుండా సందిగ్దంలో కొనసాగుతున్న భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌పై నేడు (బుధవారం) నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం పాక్‌లో ఉన్నారు. ఇస్లామాబాద్‌లో జరుగుతున్న ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొననున్నారు. ఇదే సమావేశానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పాటు విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్‌లు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో  ద్వైపాక్షిక సిరీస్ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.   జ్యోతిష్యుడ్ని కాను: మనోహర్ న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో సిరీస్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదో చెప్పడానికి తాను జ్యోతిష్యుడ్ని కానని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అన్నారు. దీన్ని తాను ఊహించలేనని స్పష్టం చేశారు.  ఈ సిరీస్‌పై పీసీబీ మాత్రం ఇంకా ఆశలు పెట్టుకుంది. ఈనెల 24 నుంచి వచ్చే ఏడాది జనవరి 5 వరకు శ్రీలంక వేదికగా మూడు వన్డేలు, రెండు టి20లు నిర్వహించే అవకాశముందని బోర్డు వర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వం అనుమతి స్తుందని పీసీబీ ఆశాభావంతో ఉంది.

చెన్నై వరదల్లో కొట్టుకుపోయి శ్రీలంకలో మృతదేహంగా తేలాడు

Image
చైన్నైలో సంభవించిన భారీ వరదల్లో పూమిదురై అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. రెస్క్యూ టీమ్ అందరూ కలిసి అతని కోసం ఎంతగా గాలించిన ఎక్కడా అచూకీ దొరకలేదు. చివరికి అతని మృతదేహం శ్రీలంకలోని త్రిన్ కోమల్లే సముద్ర తీరంలో లభ్యమైంది. మృతిడి గుర్తింపు కార్డ్ ఆధారంగా శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందింది

Mattress Dominoes World Record

ఒక అద్బుతమైన వరల్డ్ రికార్డు వీడియో మొత్తం చూడాలంటే

ఒక వ్యాపారస్తుడు

ఒక వ్యాపారస్తుడు రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టి నగరం లో ఒక పెద్ద షాపింగ్ మాల్ ను ప్రారంభిస్తాడు. దాన్ని అంచలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఆ ఏరియాలో తిరుగులేని శక్తిగా మార్చేస్తాడు. ఆ ఏరియాలో అతడో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తించ బడతాడు. మరో వ్యాపారవేత్త రూ. కోటి బడ్జెట్ తో ఒక కొత్త ప్రోడక్ట్ ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాడు. ఈయన దృష్టంతా సహజంగానే సరుకు అమ్మకాలను పెంచుకోవడం తో పాటు తన కంపెనీ బ్రాండ్ ఇమేజిని నలుదిశలా వ్యాపించేలా ప్రణాలికలు రూపొందించుకుంటాడు. ఆ దిశగానే అడుగులేస్తాడు . అనతికాలం లోనే ఆ ప్రోడక్ట్ కు బ్రాండ్ ఇమేజి వస్తుంది. అప్పుడాయన తన ప్రోడక్ట్ బ్రాండ్ ఇమేజినే పెట్టుబడిగా మార్చి దేశమంతటా ఫ్రాంచైజీలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఫ్రాంచైజీ తీసుకున్నవారి నుంచి ఈయనకు రాయల్టీ కింద కోట్ల రూపాయల ఆదాయం రావడం ప్రారంభమౌతుంది. ఇక్కడ రూ. 10 కోట్లతో వ్యాపారం ప్రారంభించిన వ్యాపారస్తుడి అమ్మకాలన్నీ అతని స్టోర్ ఉన్న ఆ ఒక్క ఏరియాకే పరిమితమౌతున్నాయి. అతనికంటే తక్కువ పెట్టుబడితో కొత్త ప్రోడక్ట్ ని రిలీజ్ చేసిన రెండో వ్యాపారస్తుడి అమ్మకాలు మాత్రం అక్కడక్కడా దేశమంతటా సాగుతూనే ఉన్నాయి. మొదటి వ...

ఫొటోలకు ‘అట్రాక్టివ్ లుక్‌’నిచ్చే PHOTOFY యాప్

Image
ఆండ్రాయిడ్ వినియోగదారులు ఇప్పుడు తమ ఫొటోలకు మరింత ‘అట్రాక్టివ్ లుక్‌’కోసం ‘ PHOTOFY PHOTO EDITING COLLAGE’ పేరిట గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. ఇందులో ఫొటోలకు కావల్సిన వివిధ రకాల ఫిల్టర్లు, లైట్ ఎఫెక్ట్‌లు, ఫొటో మిర్రర్, 90కు పైగా ఫాంట్లు, 70కి పైగా లే అవుట్లు, 40వేలకు పైగా గ్రాఫిక్ ఎలిమెంట్లు, 30కి పైగా బ్యాక్‌గ్రౌండ్ ప్యాట్రన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా యూజర్లు తమ ఫొటోలకు మరిన్ని హంగులను కల్పించవచ్చు. దీంతోపాటు టిల్ట్, రొటేట్, రిఫ్లెక్ట్, లైట్ ఎఫ్‌ఎక్స్, బ్లర్, షార్పెన్, ఇన్‌స్టా స్కేర్, వాటర్ మార్క్, టెక్ట్స్ ఓవర్‌లే, ఆర్ట్ వర్క్, స్టిక్కర్స్, ఫ్రేమ్స్, మెమె, షేప్ మాస్క్, స్టాక్ ఫొటోగ్రఫీ వంటి అనేక ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి

స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా ?

Image
వివిధ రకాల ఆకట్టుకునే ఫీచర్లతో నేడు అనేక కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లు మనకు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ప్రధానంగా వీటిలో అధిక శాతం అమ్ముడవుతున్నవి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందినవే. అయితే ఎంత బడ్జెట్‌లో ఆండ్రాయిడ్ ఓఎస్‌కు చెందిన టాప్ స్మార్ట్‌ఫోన్లు ఏవేవి వస్తాయో తెలుసుకోవాలంటే మాత్రం కింద ఇచ్చిన కథనాన్ని చదివి తీరాల్సిందే.  రూ.4,500 – రూ.7వేల బడ్జెట్‌లో షియోమీ రెడ్‌మీ 2 ప్రైమ్, లెనోవో ఎ6000 ప్లస్, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ జ్యూస్ 2, యూ యుఫోరియా ఫోన్లు వస్తాయి. రూ.7వేలు – రూ.13వేల బడ్జెట్‌లో మోటో జి (జెన్ 3), లెనోవో కె3 నోట్, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 5, కూల్‌ప్యాడ్ నోట్ 3, అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్, షియోమీ ఎంఐ4 ఫోన్లు వస్తాయి. రూ.13వేలు – రూ.20వేల బడ్జెట్‌లో మోటో ఎక్స్ ప్లే, అసుస్ జెన్‌ఫోన్ సెల్ఫీ, జెన్‌ఫోన్ 2, లెనోవో పి1, మెయ్‌జు ఎంఎక్స్5, సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా, శాంసంగ్ గెలాక్సీ జె5, జె7 వంటి ఫోన్లు వస్తాయి. రూ.20వేలు – రూ.26వేల బడ్జెట్‌లో వన్ ప్లస్ 2, అసుస్ జెన్‌ఫోన్ 2 డీలక్స్, లెనోవో వైబ్ షాట్, హువావే హానర్ 7, సోనీ ఎక్స్‌పీరియా సి4 ఫోన్లు వస్తాయి. ....

చైన్నై వరద బాధితుల కోసం ప్రత్యేకంగా పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు

Image
చైన్నై వరద బాధితుల కోసం ప్రత్యేకంగా పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు చైన్నైలో వరదలలో ఏమైనా damage ఐన passport ల  కోసం చైన్నైలో ప్రత్యేకంగా పిఎస్‌కే పాస్ పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రి   సుష్మాస్వరాజ్  వెల్లడించారు.

ఇండియాలో వాడేది ఇవేనట ఫేస్‌బుక్, వాట్సప్

Image
మన దేశంలో ఎక్కువగా ఈ యాప్స్ వాడుతున్నారు.. ఇండియాలో ఉన్న కోట్లమంది యూజర్ల స్మార్ట్ ఫోన్లలో ఏయే యాప్స్ ఉంటాయి. ఇలాంటి అంశాలపై ఈ మధ్య అధ్యయనాలు జరిగాయి. ఆ అధ్యయనాల్లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఇండియాలోని ప్రతి ఒక్కరి స్మార్ట్ పోన్ లలో ఫేస్ బుక్, వాట్సప్ ఈ రెండూ తప్పనిసరిగా ఉంటాయని అధ్యయనాల్లో తేలింది.

ఇంటర్నెట్ లేకపోయినా మొబైల్ లో సిగ్నల్ లేకపోయినా చాటింగ్ చేసుకోవచ్చు

Image
ఇంటర్నెట్ లేకపోయినా మొబైల్ లో సిగ్నల్ లేకపోయినా చాటింగ్ చేసుకోవచ్చు ఫైర్‌చాట్   అనే అప్లికేషన్ ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా చాటింగ్ సర్వీసులను అందిస్తోంది. సెంట్రల్ సర్వర్‌తో పనిలేకుండా రెండు ఫోన్‌లను ఈ యాప్ కనెక్ట్ చేస్తుంది అండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ‘ఫైర్‌చాట్’ అనే యాప్ తో మొబైల్ డేటా, వైఫై, నెట్ వర్క్ లేకుండానే చాటింగ్ సర్వీసులను అందిస్తుంది.సెంట్రల్ సర్వర్‌తో పనిలేకుండా రెండు ఫోన్‌లను ఈ యాప్ కనెక్ట్ చేస్తుంది.ఐతే బ్లూటూత్, వైఫై లను ఆన్ చేసి ఉంచాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ఇది చాలా ఉపయోగకరమని చెప్తున్నారు

వరుణ్ సందేశ్, వితిక ల నిశ్చితార్థం జరిగింది

Image
టాలీవుడ్ హీరో, హీరోయిన్లు వరుణ్ సందేశ్, వితిక శెరులు త్వరలో వివాహ బంధంతో నిజ జీవితంలో ఒక్కటి కాబోతున్నారు. సోమవారం వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది, ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ నాయకులు హాకరయ్యారు. ‘పడ్డానండి ప్రేమలో మరి’ అనే చిత్రంలో కలిసి నటించిన వీరు ఆ తర్వాత నిజంగానే ప్రేమలో పడ్డారు.

హనుమాన్ బ్రిడ్జి

Image
లంకకు చేరడానికి ఆనాడు హనుమంతుడు నిర్మించిన వారధి రామసేతు మీద భారత్-శ్రీలంక దేశాలు అతిపెద్ద వంతెన నిర్మించబొతున్నయి. ఈ రెండు దేశలను కలిపే విధంగా 19 కిలొమీటర్లమేర నిర్మిచనున్న ఈ బ్రిడ్జిను రామసేతు కు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా అతిపెద్ద  Suspension Bridge  నిర్మించనున్నారు. హనుమంతును ఆద్వర్యంలొ రామసేతు నిర్మాణం జరగడం వలన కట్టబొయే బ్రిడ్జికి  ‪ హనుమాన్ బ్రిడ్జి    గా నామకరణం చేయనున్నారు. దీనికి ఇప్పటికే ఏషియా వాణిజ్య బ్యాంకు 5 బిలియన్ డాలర్లు మంజూరు చేసింది. వలన శ్రీలంక-భారత్ లమద్య వాణిజ్య సంబందాలు మెరుగుపడటమేకాకుండా మనదేశంలొ ఉన్న పొర్టులన్నీ తీవ్ర రద్దీగా ఉండటం వలన మన ఏగుమతులను తేలికగా కొలంబొ నుండి విదేశాలకు ఏగుమతి చేయవచ్చు

WHATSAPP NEW UPDATE

Image
వాట్స్ అప్ కొత్త అప్ డేట్ వచ్చింది. కొత్తగా ఎం వచాయంటే ? Starred మెసేజెస్ - మీకు నచ్చిన చాట్స్ లోని మెసేజ్ లను లాంగ్ ప్రెస్ చేసి, స్టార్ చేయగలరు. సో వీటిని కావలసినప్పుడు ఈజీగా చూడగలరు. పైన  రైట్ సైడ్ మెను లో starred మెసేజెస్ అని ఉంటుంది. లింక్ ప్రివ్యూస్ - ఏదైనా లింక్ షేర్ చేస్తే లింక్ తో పాటు ఆ లింక్ లో ఏముందో ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రివ్యూ కనపడకుండా కూడా ఆప్షన్ పెట్టుకోవచ్చు. వాట్స్ అప్ కాల్స్ లో డేటా ను తక్కువ వాడుతుంది ఈ కొత్త అప్ డేట్ లో. సెట్టింగ్స్ లో తక్కువ  డేటా ఆప్షన్ ను ఏనాబుల్ చేయాలి