గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడడం ద్వారా మొబైల్ ఇంటర్నెట్ డేటా'ను సేవ్ చేసుకోండిలా...

స్మార్ట్‌ఫోన్లు కలిగిన వినియోగదారులు ఇప్పుడు తమ తమ డివైస్‌లలో 70 శాతం వరకు డేటాను ఆదా చేసుకోవచ్చు. డివైస్‌లలో ఉండే 'గూగుల్ క్రోమ్ బ్రౌజర్' ద్వారా ఇది సాధ్యపడుతుంది. గూగుల్ కంపెనీ ప్రతినిధులే చెబుతున్నారు.
అధిక శాతం మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు 'వైఫై హాట్‌స్పాట్'ల ద్వారా ఇంటర్నెట్ పొందుతున్నారు. కానీ కొన్ని సార్లు మొబైల్‌లోని డేటా కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్‌ను పొందాల్సి వస్తోంది. దీంతోపాటు తక్కువ బ్యాండ్ విడ్త్ కలిగిన వినియోగదారులు కూడా వెబ్ పేజీలు సరిగా లోడ్ అవక ఇబ్బందులు పడుతుంటారు.
అయితే మీరు ఇప్పుడు మీ డివైస్‌లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడడం ద్వారా ఆయా వెబ్‌సైట్లను వేగంగా లోడ్ చేసి చూడడమే కాకుండా , ఇంటర్నెట్ డేటాను కూడా ఆదా చేసుకునేందుకు వీలుంది. ఎలా అంటే ముందుగా డివైస్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను డౌన్లోడ్ చేసుకోండి .తర్వాత Settings లోకి వెళ్లి Advanced > DATA SAVER ఆప్షన్‌ను ఆన్ చేసుకుంటే సరిపోతుంది.
దీని వల్ల ఇంటర్నెట్ డేటా సేవ్ అవుతుంది. తక్కువ బ్యాండ్ విడ్త్ ఉంటే కేవలం టెక్ట్స్ వెర్షన్‌లోనే వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. స్పీడ్ ఎక్కువైతే ఆటోమేటిక్‌గా ఇమేజ్‌లను కూడా లోడ్ చేసుకోవచ్చు.
Comments
Post a Comment