ఇష్టమైన పుస్తకాన్ని ఉల్లాసంగా వినేయండి....!
బడికెళ్లే పిల్లాడి నుంచి సీఈవోల వరకూ ఎవర్ని చూసినా తీరిక లేకుండా కనిపిస్తున్నారు. చేతిలోకి స్మార్ట్ ఫోన్, అందులో అంతర్జాలం వచ్చేశాయి. మునుపటిలా గ్రంథాలను చేతబట్టి, చదివే సమయం తగ్గిపోయిందని పుస్తక ప్రియులు వాపోతున్నారు. ఈ సమస్యను అధిగమించి, పుస్తక ప్రియుల ఆసక్తిని రెట్టింపు చేసేందుకు న్యూజిలాండ్‌కు చెందిన అంకుర సంస్థ (స్టార్టప్) ‘‘బుక్‌ట్రాక్’’ పరిష్కారంతో ముందుకొచ్చింది. సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీకు ఇష్టమైన పుస్తకంపై క్లిక్ చేస్తే... అదే చదివి వినిపిస్తుంది. కథనానికి అనుగుణంగా సినిమా రీతిలో సంగీతాన్ని మేళవించి! స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను బుక్‌ట్రాక్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మీకు ఇష్టమైన పుస్తకాలను వినేయొచ్చు. బస్సులో కాలేజీకి వెళ్తున్నా, పార్కులో వాకింగ్ చేస్తున్నా మీపఠనం (శ్రవణం) నిరాటంకంగా సాగిపోతుంది. ఈ సాఫ్ట్‌వేర్ తన మానాన తాను ఇష్టం వచ్చినట్టు చదువుకెళ్లిపోదట! మీరు వాడుతున్న పరికరం తెరపై కథనాన్ని ఎంత వేగంతో చదువుతున్నారో గమనించి, అంతే వేగంలోనే మీకు చదివి వినిపిస్తుందని సంస్థ సీఈవో సామ్యుయెల్ కమెరాన్ వివరించారు