ఇండో-పాక్ సిరీస్‌పై నేడు నిర్ణయం
కరాచీ: ఎటూ తేలకుండా సందిగ్దంలో కొనసాగుతున్న భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌పై నేడు (బుధవారం) నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం పాక్‌లో ఉన్నారు. ఇస్లామాబాద్‌లో జరుగుతున్న ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొననున్నారు. ఇదే సమావేశానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పాటు విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్‌లు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సిరీస్ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
జ్యోతిష్యుడ్ని కాను: మనోహర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో సిరీస్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదో చెప్పడానికి తాను జ్యోతిష్యుడ్ని కానని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అన్నారు. దీన్ని తాను ఊహించలేనని స్పష్టం చేశారు. ఈ సిరీస్‌పై పీసీబీ మాత్రం ఇంకా ఆశలు పెట్టుకుంది. ఈనెల 24 నుంచి వచ్చే ఏడాది జనవరి 5 వరకు శ్రీలంక వేదికగా మూడు వన్డేలు, రెండు టి20లు నిర్వహించే అవకాశముందని బోర్డు వర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వం అనుమతి స్తుందని పీసీబీ ఆశాభావంతో ఉంది.
Comments
Post a Comment