స్మార్ట్‌ఫోన్ తో ఇక పై చదువుకోండి..
స్మార్ట్‌ఫోన్ తో ఇక పై ఫోన్‌కాల్స్, ఇంటర్నెట్, facebook whatsapp,Games , ఫోటోలు, వీడియోలు చూడడం ఈ పనులకే కాదు ఇప్పుడు చదువుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఎలా అంటే KHAN ACADEMY అనే ఈ యాప్ ద్వారా . అవును... దీని ద్వారా ఆయా సబ్జెక్టులను ఉచితంగా చదువుకోవచ్చు.డౌన్లోడ్ చేసుకోవడానికి పేరు మీద క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై లభిస్తున్న ఈ యాప్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇందులో గణితం, సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్, సివిక్స్, ఫైనాన్స్ తదితర అనేక అంశాలకు చెందిన టాపిక్స్ ఉన్నాయి. వీటిలో విద్యార్థులు తమకు కావల్సిన సబ్జెక్టును చదువుకోవచ్చు.
వీటికి సంబంధించిన దాదాపు 10వేలకు పైగా వీడియోలు కూడా ఈ యాప్‌లో ఉన్నాయి.
ఖాన్ అకాడమీ ఒక లాభాపేక్ష లేని విద్యా సంస్థ. దీనిని 2006 లో యoఐటి నుండి పట్టాపొందిన సల్మాన్ ఖాన్
అనే దక్షిణాసియా మూలాలు గల అమెరికన్ స్థాపించాడు."అత్యున్నత ప్రమాణాలు గల విద్య అందరికీ ఎక్కడైనా "అందించే ఉద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ.
2700 పైగా సూక్ష్మ వీడియో ప్రసంగాలు
యూ ట్యూబ్ ద్వారా గణితం, చరిత్ర, ఆరోగ్యం & వైద్యం, విత్త శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రము, ఖగోళ శాస్త్రం మరియుకంప్యూటర్ సైన్స్ లాంటి వివిధ విద్యా విషయాలలో అందిస్తుంది
Comments
Post a Comment