Adobe ఫొటోషాప్ లైట్ రూం



ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీసీ యూజర్లలో అధిక శాతం మంది వాడుతున్న ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ 'ఫొటోషాప్'. అడోబ్ సంస్థకు చెందిన ఈ సాఫ్ట్‌వేర్ కొంత మార్పు చెంది 'లైట్ రూం' పేరిట కూడా పీసీ, ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీన్ని వాడుకోవాలంటే గతంలో ఎంతో కొంత రుసుం చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రం ఎలాంటి రుసుం లేకుండానే 'PHOTOSHOP LIGHTROOM' యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
ఐఓఎస్ యూజర్లకు ఈ యాప్ ఇప్పటికే ఉచితంగా లభిస్తుండగా, తాజాగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా దీన్ని ఫ్రీగా అందిస్తున్నారు. ఈ యాప్ ద్వారా డివైస్‌లోని ఫొటోలను మనకు కావల్సిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. అందుబాటులో ఉండే ఫిల్టర్స్, ఎఫెక్ట్స్‌ను ఉపయోగించి మన ఫొటోలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు..

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer