గూగుల్ నుండి అఫిషియల్ గా కొత్త తెలుగు టైపింగ్ కీ బోర్డ్ అప్లికేషన్
Google Indic Keyboard
గూగుల్ తాజాగా తెలుగు మరియు ఇతర ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్ కోసం అఫిషియల్ కీ బోర్డ్ అప్లికేషన్ లాంచ్ చేసింది.
ఇది తెలుగు టైప్ చేయటానికి రెండు మెథడ్స్ ఇస్తుంది...
1. Tinglish (ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తో తెలుగు పదాలను వ్రాయటం. Eg - TELANGANA అని టైప్ చేస్తే తెలంగాణా అని వస్తుంది)
2. డైరెక్ట్ గా కీ బోర్డ్ పై ఉండే తెలుగు అక్షరాల కీస్ ప్రెస్ చేసి, తెలుగు వ్రాయటం. Tinglish టైపింగ్ చాలా ఈజీ.
తెలుగు కీ బోర్డ్ తో పాటు ఇంగ్లీష్ కూడా ఇస్తుంది. అయితే ఆప్షనల్ గా ఈ రెండింతో పాటు ఇతర భాషలు కూడా యాడ్ చేయగలరు అదే యాప్ లో. తెలుగు టైప్ చేసేటప్పుడు పైన సజెషన్స్ కూడా ఇస్తుంది. సో మీరు కంప్లీట్ వర్డ్ టైప్ చేయవలసిన అవసరం ఉండదు.
కీస్ పై ప్రెస్ చేస్తే, సౌండ్, అండ్ వైబ్రేషన్ కూడా వస్తుంది. DOWNLOAD చేసుకోవడానికి
ఈ లింక్ లో చూడగలరు.

Comments
Post a Comment