BEST ANTI-THEFT ANDROID APP
ఈ యాప్ పేరు Cerberus.దీనికి మిగిలిన ఫోన్లకు ఉన్న తేడా ... ఇది కేవలం ఫోన్ ఏ ప్రదేశంలో ఉంది అనే విషయమే మాత్రమే కాదు, ఎవరి చేతుల్లో ఉంది, అతని ముఖం కుడా చూపించి ఫోన్ మీ వద్దకు తిరిగి తెచ్చే ఆప్షన్స్ ఇస్తుంది.
A) వెబ్ సైట్ ద్వారా మీ ఫోన్ ను రిమోట్ కంట్రోలింగ్ చేయటం.
B) SMS కమాండ్స్ ద్వారా రిమోట్ కంట్రోల్. (పోయిన ఫోన్ లో నెట్ లేకపోతే)
C) మీరు కంట్రోల్ చేయకుండానే ఆటోమేటిక్ గా అది అలర్ట్స్ పంపటం. (పోయిన విషయం తెలియనప్పుడు)
కేవలం మొబైల్ లొకేషన్ ట్రాకింగ్ కాదు, ఫోన్ వాడుతున్న వ్యక్తి యొక్క ఫోటో , వీడియోస్ కూడా పంపిస్తుంది మెయిల్ కు. దొంగతనం చేసిన వ్యక్తి ఫోన్ షాట్ డౌన్ కూడా చేయనివ్వకుండా పవర్ ఆప్షన్ ను డిసేబుల్ చేస్తుంది. అలాగే స్టేటస్ బార్ కూడా బ్లాక్ చేయగలదు.ఫోన్ ను సిస్టం యాప్ గా ఇంస్టాల్ చేస్తే(రూట్ ఉంటే) కంప్లీట్ UNINSTALL చేసి GPS ను తిరిగి ఏనాబెల్ చేస్తుంది. మైక్రోఫోన్ ద్వారా ఆడియో రికార్డింగ్.
1. సిమ్ మార్చగానే, మెయిల్ కు లేదా మీరు ముందుగా సెట్ చేసిన నంబర్ కు ఫోన్ వాడుతున్న వ్యక్తి యొక్క ఫోటో ను పంపిస్తుంది.
2. మీరు ముందుగా సెట్ చేసిన ఏరియా నుండి ఫోన్ దాటితే, మెయిల్ కు అలెర్ట్ వస్తుంది.
ఇవన్నీ మొదటి వారం రోజులు ఫ్రీ, తరువాత ప్రతీ మూడు సంవత్సరాలకు 300 రూ పే చేయాలి. ఇప్పుడు ఇది మీకు నచ్చని విషయం. కదూ? కాని ఫోన్ పోతే కొన్ని వేల రూ కు పోగొట్టుకునే బదులు ఇయర్ కు 100 రూ ఖర్చు చేయటం బెటర్ కదా. DOWNLOAD HERE
Comments
Post a Comment