వాట్సాప్ వార్నింగ్.



సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్‌తో పనిచేసే తక్షణ సమాచార వ్యవస్థే వాట్సాప్. వీడియోలు, మెస్సేజ్‌లు ఉచితంగా పంపించుకునే వీలుండడంతో అధికంగా వాడుతుంటారు. ప్రతి రోజూ వాట్సాప్‌ల ద్వారా కోట్లలో మెస్సేజ్‌లు, ఫొటోలు వెళ్తున్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వాట్సాప్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకోసం

ఎక్కడో మనం సరదాగా తీసుకున్న ఫొటోను మన స్నేహితులకు షేర్‌చేస్తే, మన ప్రమేయం లేకుండానే ఇతరులు చూసే ఆస్కారం ఉంది. దానిని మార్పింగ్ చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే వ్యక్తిగత సమాచారం, ఫొటోలు ఇతరులకు షేర్ చేయకపోవడమే మంచిది. అలాగే లొకేషన్ షేరింగ్ కూడా మన భద్రతకు ముప్పు తెస్తుంది. దీనివల్ల మనం ఎక్కడున్నామో అగంతకులకు తెలిసే వీలుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* ఫొటో అప్‌లోడ్‌పై అజాగ్రత్త వద్దు.
* నిబంధనలు తెలియని యాప్‌లు డౌన్‌లోడ్ చేయద్దు.
* అపరిచితుల సందేహాలకు సమాధానం ఇవ్వద్దు.
* యాంటీ హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను మొబైల్‌లో ఉంచుకోవద్దు.
* ఫ్యామిలీ పర్యటనల వివరాలు, లొకేషన్స్ షేర్ చేయద్దు.
* పరిచయం, నమ్మకం లేని వ్యక్తులతో షేరింగ్ అసలే వద్దు.
* పిల్లల ఫొటోలు, వివరాలు షేర్ చేయడమూ ప్రమాదమే.

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం