ఫోన్‌ను ముట్టుకోకుండా మెసెజ్‌కు రిప్లై ఇవొచ్చు...



డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ టెక్స్టింగ్ చాలా ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చాలా మంది పెడచెవిన పెట్టేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్నసమయంలో స్మార్ట్‌ఫోన్‌లను వాడటం కారణంగా డ్రైవింగ్ పై ఏకాగ్రత దెబ్బతింటుంది, ఈ కారణంగా ఎటువంటి అనర్థాలైనా జరగొచ్చు.డ్రైవింగ్ సీటులో కూర్చున్నప్పుడు సాధ్యమైనంతవరకు వరకు ఫోన్ టెక్స్టింగ్ లకు దూరంగా ఉండండి.

అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలి..?

కొన్ని ముఖ్యమైన సందేశాలకు తక్షణమే రిప్లై ఇవ్వవల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో హ్యాండ్స్- ఫ్రీ మెసేజింగ్ ఆప్షన్‌ను మీరు ఎంపిక చేసుకున్నట్లయితే రిస్క్ కాస్త తగ్గుతుంది.
ఆండ్రాయిడ్ యూజర్లు కోసం ‘Google Now' ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం గూగుల్ ‘Google Now' పేరుతో శక్తివంతమైన టూల్‌ను లాంచ్ చేసింది. వాయిస్ కమాండ్స్ ఆధారంగా స్పందించే ఈ హ్యాండ్స్ - ఫ్రీ టూల్ మీ వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేస్తుంది.ఆండ్రాయిడ్ ఫోన్ మైక్రోఫోన్‌కు వినిపించేలా "OK, Google" అని చెప్పండి. వెంటనే ‘Google Now' మీ మాటలు వినే ప్రయత్నం చేస్తుంది. తాజాగా పొందుపరిచన అప్‌డేట్‌లో భాగంగా గూగుల్ నౌ వాయిస్ కమాండ్ ఫీచర్ మెసేజ్‌లను కూడా చదువుతోంది.
‘Google Now' వాయిస్ టూల్‌ను ఉపయోగించుకుని మీ ఫోన్‌కు వచ్చిన చివరి సందేశాన్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఫోన్ మైక్రోఫోన్ కు వినిపించేలా "OK, Google" show my last messages on phone అని కమాండ్ ఇవ్వండి.వెంటనే గూగుల్ మీ ఫోన్ చివరిగా వచ్చిన 5 మెసేజ్‌లను చూపిస్తుంది.
ఆ మెసేజ్‌లను మీరు వినాలనుకుంటే ‘గూగుల్ నౌ' ఆ మెసెజ్‌లను చదివి వినిపించటంతో పాటు రిప్లై ఇవ్వమంటారా అని కూడా అడుగుతుంది.

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం