మొజిల్లా ఫైర్‌ఫాక్స్' ఓఎస్‌కు తెర.

 

ఇంటర్నెట్ బ్రౌజర్ సాఫ్ట్‌వేర్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్న మొజిల్లా సంస్థ గత 2 ఏళ్ల కింద ప్రవేశపెట్టిన తన 'మొజిల్లా ఫైర్‌ఫాక్స్' ఓఎస్‌ను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. అయితే సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు మాత్రం ఈ ఓఎస్ అందుబాటులోనే ఉంటుంది. వారు దీన్ని తమ ప్రయోగాల కోసం ఉపయోగించుకోవచ్చు. 

వినియోగదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉన్నందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు మొజిల్లా ప్రతినిధులు చెబుతున్నారు. 2013లో ఫైర్‌ఫాక్స్ ఓఎస్‌ను ప్రవేశపెట్టగా 'స్పైస్ ఫైర్ వన్ ఎంఐ-ఎఫ్‌ఎక్స్2, ఆల్కాటెల్ వన్ టచ్ ఫైర్ సి, ఆల్కాటెల్ ఆరెంజ్ కిల్ఫ్, ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్‌ఎక్స్, ఫైర్‌ఫాక్స్ యూ105, ఎల్‌జీ ఎఫ్‌ఎక్స్0' వంటి డివైస్‌లు దీన్ని ఆధారంగా చేసుకుని మార్కెట్‌లోకి వచ్చాయి. దీంతోపాటు పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా ఫైర్‌ఫాక్స్ ఓఎస్ ఆధారిత 'హెచ్‌డీ టీవీ'లను వినియోగదారుల కోసం ప్రవేశపెట్టాయి. 

అయితే ఈ ఉత్పత్తులకు అంతగా ఆదరణ లభించలేదు. దీంతో ఆ ఓఎస్‌కు ప్రస్తుతం మొజిల్లా సంస్థ చరమ గీతం పాడింది. ఇప్పుడిది అందుబాటులో లేకపోయినా యూజర్లకు మరింత నాణ్యంగా సేవలందించేలా తీర్చిదిద్ది త్వరలోనే పునరాగమనం చేస్తామని మొజిల్లా చెబుతోంది.

Comments

Popular posts from this blog

ఆల్ టెలికం కంపెనీల అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌

FSViewer

Adobe ఫొటోషాప్ లైట్ రూం