మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చటం ఏలా...
ఇంటర్నెట్‌ను వినియోగిస్తోన్న దాదాపు చాలామందికి ఈ పదం తెలుసు. వై-ఫై (వైర్ లెస్ ఫెడిలిటీ), ఈ సాంకేతిక ఆధారంగా కేబుల్ అవసరం లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్‌ను సమీప ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లకు వైర్ల సహాయం లేకుండా విస్తరించుకోవచ్చు.
థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హబ్‌గా మార్చే ప్రక్రియను తెలుసుకుందాం..
వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చాలనుకుంటున్న మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో తప్పనిసరిగా వైర్‌లెస్ అడాప్టర్ ఉండాలి.
మీ ల్యాప్‌టాప్‌లో వై-ఫై హాట్ స్పాట్‌ను క్రియేట్ చేసేందుకు అనేక థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు My Wifi Router..
మీ ల్యాప్‌టాప్‌లో వై-ఫై హాట్ స్పాట్‌ను సెటప్ చేసే క్రమంలో మీ హాట్ స్పాట్‌కు ఇతర డివైస్‌లు ఏ విధమైన పాస్‌వర్డ్ సహాయం లేకుండా కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది.
WEPను సెలక్ట్ చేసుకున్నట్లయితే హాట్ స్పాట్ కు కనెక్ట్ అయ్యే ప్రతి కనెక్షన్ కు పాస్ వర్డ్ అవసరమవుతుంది. సాధ్యమైనంత వరకు మీ హాట్ స్పాట్ ను సెక్యూరిటీ కనెక్టెడ్ మోడ్ లో లాంచ్ చేయండి.
Comments
Post a Comment