ఒక వ్యాపారస్తుడు
ఒక వ్యాపారస్తుడు రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టి నగరం లో ఒక పెద్ద షాపింగ్ మాల్ ను ప్రారంభిస్తాడు. దాన్ని అంచలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఆ ఏరియాలో తిరుగులేని శక్తిగా మార్చేస్తాడు. ఆ ఏరియాలో అతడో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తించ బడతాడు.
మరో వ్యాపారవేత్త రూ. కోటి బడ్జెట్ తో ఒక కొత్త ప్రోడక్ట్ ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాడు. ఈయన దృష్టంతా సహజంగానే సరుకు అమ్మకాలను పెంచుకోవడం తో పాటు తన కంపెనీ బ్రాండ్ ఇమేజిని నలుదిశలా వ్యాపించేలా ప్రణాలికలు రూపొందించుకుంటాడు. ఆ దిశగానే అడుగులేస్తాడు.
అనతికాలం లోనే ఆ ప్రోడక్ట్ కు బ్రాండ్ ఇమేజి వస్తుంది. అప్పుడాయన తన ప్రోడక్ట్ బ్రాండ్ ఇమేజినే పెట్టుబడిగా మార్చి దేశమంతటా ఫ్రాంచైజీలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఫ్రాంచైజీ తీసుకున్నవారి నుంచి ఈయనకు రాయల్టీ కింద కోట్ల రూపాయల ఆదాయం రావడం ప్రారంభమౌతుంది.
ఇక్కడ రూ. 10 కోట్లతో వ్యాపారం ప్రారంభించిన వ్యాపారస్తుడి అమ్మకాలన్నీ అతని స్టోర్ ఉన్న ఆ ఒక్క ఏరియాకే పరిమితమౌతున్నాయి. అతనికంటే తక్కువ పెట్టుబడితో కొత్త ప్రోడక్ట్ ని రిలీజ్ చేసిన రెండో వ్యాపారస్తుడి అమ్మకాలు మాత్రం అక్కడక్కడా దేశమంతటా సాగుతూనే ఉన్నాయి.
మొదటి వ్యాపారస్తుడు ప్రారంభించిన వ్యాపారం లో రిస్క్ తక్కువ. ఆదాయమూ తక్కువే.అమ్మకాలు సరిగ్గా లేకుంటే స్టోర్ ని మరో ఏరియాకి మార్చుకోవచ్చు. అక్కడా అదే పరిస్థితి ఎదురైతే ఉన్న సరుకునంతా గంపగుత్తగా డిస్కౌంట్ రేటులో అమ్మేసి కొంచెం నష్టం తో బయట పడవచ్చు.
రెండో వ్యాపారస్తుని పరిస్థితి అలాంటిది కాదు. తాను సృష్టించిన ప్రోడక్ట్ మార్కెట్లో ఫెయిలయితే మొదటికే మోసమొస్తుంది. పెట్టిన డబ్బులో రూపాయీ తిరిగిరాదు. కానీ ‘సక్సెస్’ అయితే ..కోట్లు, వందల కోట్లు ఆయన సొంతమౌతాయి. అదో పెద్ద విజయమౌతుంది .
రిస్క్ కు సిద్దపడి తెలివిగా వ్యవహరిస్తున్నవారే ఇప్పుడు బడా వ్యాపారవేత్తలుగా మన కళ్ళముందు కదలాడుతున్నారు. ధైర్యం చేసే శక్తిలేని వ్యక్తులు సాదాసీదా వ్యక్తులుగా తమపని తాము చేసుకుపోతున్నారు.
“జీవితానికి సరిపడే మినిమమ్ ఆర్ధిక స్వేచ్చ ఇప్పటికే కలిగి ఉన్న వ్యక్తులు, ఆ తరువాత ‘రిస్క్’ తీసుకుని అదృష్టాన్ని పరీక్షించుకోవడమే ఉత్తమం. ఈ స్టేజ్ లో నిండా మునిగినా కొంపలేం మునిగిపోవు. తేలితే మాత్రం అపారమైన సంపదే !! మరింత మెరుగైన జీవనమే
Comments
Post a Comment